దిల్లీ: , 28 జూలై (హి.స.)ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీనిపై సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పహల్గాం ఉగ్రదాడి వెనక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా తీవ్రంగా మండిపడింది. అసలేం జరిగిందంటే..
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. ‘‘పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏం చేసిందన్నది బయటపెట్టేందుకు ప్రభుత్వం విముఖత చూపిస్తోంది. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. వారు దేశీయ ఉగ్రవాదులే కావొచ్చన్న సందేహాలూ ఉన్నాయి. అలాంటప్పుడు పాకిస్థాన్ నుంచి వచ్చారని ఎలా అనుకుంటారు? దానికి ఆధారాలున్నాయా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ