‘సిందూర్‌’పై చర్చకు ముందు రిజిజు ఆసక్తికర పోస్ట్‌
దిల్లీ, 28 జూలై (హి.స.)ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)పై పార్లమెంటులో నేడు వాడీవేడి చర్చకు రంగం సిద్ధమైంది. లోక్‌సభలో సిందూర్‌పై ప్రశ్నలు సంధించేందుకు విపక్ష కూటములు ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని గంటల్లో చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమ
Kiren Rijiju


దిల్లీ, 28 జూలై (హి.స.)ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)పై పార్లమెంటులో నేడు వాడీవేడి చర్చకు రంగం సిద్ధమైంది. లోక్‌సభలో సిందూర్‌పై ప్రశ్నలు సంధించేందుకు విపక్ష కూటములు ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని గంటల్లో చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ఆసక్తికరమైన పోస్టు చేశారు. రావణుడు లక్ష్మణరేఖను దాటడం వల్ల అతని సామ్రాజ్యమైన లంక అగ్నికి ఆహూతి అయ్యిందని.. అదేవిధంగా భారత్‌ గీసిన గీత దాటినప్పుడు పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలు కాలిబూడిదయ్యానని రాసుకొచ్చారు.

ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో బిహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలు వంటి విషయాలపై ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తుండటంతో పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శనివారం తన ఛాంబర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సోమవారం నుంచి లోక్‌సభలో చర్చకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande