ఢిల్లీ, 28 జూలై (హి.స.)
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పై పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం విదితమే. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆయన వెల్లడిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చ ప్రారంభం కావాల్సి ఉండగా, బీహార్‌లో ఓటర్ల సమగ్ర సవరణ సర్వేపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి