అమరావతి, 29 జూలై (హి.స.)
అమరావతి: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమ్మిట్ నిర్వహణకు పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందానికి మంత్రి లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వసతుల కల్పన, ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మరో 9 వర్కింగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ