బీసీ కులగణనపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుందాం : వి.హనుమంతరావు
తెలంగాణ, 30 జూలై (హి.స.) బీసీ కుల గణన పై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుందామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీ
హనుమంతరావు


తెలంగాణ, 30 జూలై (హి.స.)

బీసీ కుల గణన పై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుందామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన పై ఉద్యమిస్తున్న రాహుల్ గాంధీకి పాలాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొని రాహుల్ గాంధీ చిత్రపటానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని తపించిన మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో 20వ శతాబ్దంలో రాహుల్ గాంధీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరగని కులగణనపై ఉద్యమిస్తున్నాడని గుర్తు చేశారు. బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని కోరిన పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande