తిరుమల శ్రీవారి ఆలయం ముందు.మాడవీధుల్లో.కొంతమంది రీల్స్ చేస్తుండడం పై టిటిడి ఆగ్రహం
అమరావతి, 31 జూలై (హి.స.) తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో సోషల్‌ మీడియా రీల్స్‌ చేస్తుండటంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని తితిదే వ
తిరుమల శ్రీవారి ఆలయం ముందు.మాడవీధుల్లో.కొంతమంది రీల్స్  చేస్తుండడం పై టిటిడి ఆగ్రహం


అమరావతి, 31 జూలై (హి.స.)

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో సోషల్‌ మీడియా రీల్స్‌ చేస్తుండటంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని తితిదే విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది.

భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని తితిదే పేర్కొంది. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని.. ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కావాలని సూచించింది. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని తితిదే

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande