అమరావతి, 31 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. On వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. ఆగస్టు 2వ తేదీన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. అదే రోజున పీఎం కిసాన్ పథకం నిధులనూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14,000 కూటమి ప్రభుత్వం ఇవ్వనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ