అమరావతి, 31 జూలై (హి.స.)
తాళ్లూరు : ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయపాలెం గ్రామంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నదాతా.. సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడంతోపాటు వారితో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈసందర్భంగా దర్శి ప్రాంత సమస్యలపై నేరుగా అక్కడి ప్రజలతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి అనుకూలమైన స్థలాలను ఎంపిక చేసేందుకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్, తెదేపా నాయకులు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ