RIMS మెడికల్ కళాశాలలో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ, ఆదిలాబాద్. 30 జూలై (హి.స.) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థ
విద్యార్థి ఆత్మహత్య


తెలంగాణ, ఆదిలాబాద్. 30 జూలై (హి.స.) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సాహిల్ చౌదరి అనే విద్యార్థి మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే పరీక్షలు దగ్గర పడుతున్న కారణంగా ఆందోళనకు గురవుతున్నాడని... పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం రిమ్స్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. విషయం తెలిసిన వెంటనే రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ హాస్టల్ కు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande