రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్.కార్డులు పంపిణీ
అమరావతి, 29 జూలై (హి.స.) అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో ఈ కార్డులను రూపొందించినట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్.కార్డులు పంపిణీ


అమరావతి, 29 జూలై (హి.స.)

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు.

‘‘కొత్తగా 9లక్షల మందికిపైగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలోని 29,796 రేషన్‌ షాపుల్లో ప్రతినెలా 1 నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్యం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు రేషన్‌ సరఫరా చేస్తున్నాం. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అక్కర్లేదు’’అని మంత్రి నాదెండ్ల తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande