హైదరాబాద్, 29 జూలై (హి.స.)
నల్గొండ జిల్లా నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పని చేయనివ్వటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. సీఎం రేవంత్ కుర్చీ కాపాడుకోవాడం కోసమే తన సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని, అందువల్లే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. యూరియా విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి సవాల్ రామచంద్ర రావు సవాల్ విసిరారు. ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు సేకరిద్దాం అని, తనది తప్పైతే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. యూరియా సరఫరా విషయంలో ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు తీసుకోవచ్చని, అందులో తాము చెప్పేది అబద్ధమైతే తాను రాజీనామాకు సిద్ధమని.. మరి తుమ్మల రాజీనామా చేస్తాడో చూడాలని రామచంద్ర రావు అన్నారు.
కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లా వారి కంచుకోట అనుకుంటే భవిష్యత్లో ఖచ్చితంగా బీజేపీ అడ్డగా మారుతుందని రామచందర్ రావు పేర్కొన్నారు. 'చాలా మంది కమ్యూనిస్టులు బీజేపీలోకి వస్తామని అంటున్నారు. కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా తుడుచుకుపోయారు. కమ్యూనిస్టులను నేను అవమానించడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ పార్టీ, ఈ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి, కానీ అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించకూడదు. బీసీ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చింది బీజేపీ మాత్రమే. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఒక్క శాతం తగ్గిన ఊరుకునేది లేదు' అని హెచ్చరించారు.
'మొన్న బండి సంజయ్ చెప్పాడు.. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లింల రిజర్వేషన్ అని. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు. కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద దేశంలో ప్రతి రైతుకు డబ్బులు పడ్డాయి. ఖమ్మంలో కూడా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ, ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీ మీద విశ్వాసంతో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలి' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..