హైదరాబాద్, 29 జూలై (హి.స.)
హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నగర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. అందుకు సంబంధించి దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ , బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలలో సమస్యలను అధ్యయనం చేయాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..