విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన.. ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
హుజూరాబాద్, 29 జూలై (హి.స.) హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎం.జె.పి. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్లోని సైదాపూర్ ఎం.జె.పి. పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై విచారణ నిమిత్తం ఎమ్మెల్యే పాడి కౌశ
ఎమ్మెల్యే కౌశిక్


హుజూరాబాద్, 29 జూలై (హి.స.)

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎం.జె.పి. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్లోని సైదాపూర్ ఎం.జె.పి. పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై విచారణ నిమిత్తం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పర్యటించారు. ఈ ఘటన పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, విద్యార్థుల భద్రత, ప్రభుత్వ నిర్లక్ష్యం పై పలు ప్రశ్నలు సంధించారు. పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన పై ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పాఠశాల ప్రిన్సిపాల్పై మండిపడ్డారు. మీ సొంత పిల్లలను ఎలుకలు కొరికితే ఇలాగే ఉంటారా అంటూ ప్రశ్నించారు. పాఠశాలలో పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande