గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే : మంత్రి సీతక్క
కామారెడ్డి, 29 జూలై (హి.స.) పదేళ్లు పరిపాలన చేసి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని, ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారం కోల్పోయాక, మహిళలు, పేదలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆమె కామారెడ్డి జిల్లా దోమకొ
మంత్రి సీతక్క


కామారెడ్డి, 29 జూలై (హి.స.)

పదేళ్లు పరిపాలన చేసి ఒక్క రేషన్

కార్డు కూడా ఇవ్వని, ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారం కోల్పోయాక, మహిళలు, పేదలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆమె కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన డ్వాక్రా రుణాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పదేళ్లపాటు కొత్త రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రజలను చెప్పులరిగేలా తిప్పించుకొని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు.

కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు రేషన్ కార్డులు ఇస్తుంటే, అది చూసి ఓర్చుకోలేక ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళల, పేదల సంక్షేమం గుర్తుకు రానివారు, అధికారం కోల్పోయాక మహిళలు పేదల సంక్షేమం గురించి సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విడ్డూరంగా ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande