తెలంగాణ, సిద్దిపేట. 29 జూలై (హి.స.)
పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కళను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డులు మంజూరైన లబ్దిదారులకు మంత్రి వివేక్ మంగళవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం కోసం పేదలు ఎదురుచూచారని అన్నారు. పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సున్న వడ్డీ రుణ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు