నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన మంత్రులు.. ఉత్తంకుమార్, లక్ష్మణ్
తెలంగాణ, నల్గొండ. 29 జూలై (హి.స.)వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు గేట్లను తెరిచారు. మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఓపెన్ చేశారు. షెడ్యూల్ ప్ర
నాగార్జునసాగర్


తెలంగాణ, నల్గొండ. 29 జూలై (హి.స.)వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు గేట్లను తెరిచారు. మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఓపెన్ చేశారు.

షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ గేట్లను తెరువాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు అందరూ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దాంతో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లారు. పూజా కార్యక్రమం నిర్వహించి సాగర్ 14 గేట్లను ఎత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande