అమరావతి, 29 జూలై (హి.స.)
, అమలాపురం: కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చజెండా ఊపింది. ఈ తరుణంలో ఆర్టీసీ బస్టాండ్లలో ఆధునిక వసతులు కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అమలాపురంతోపాటు రామచంద్రపురం, రాజోలు డిపోల పర్యవేక్షణ బాధ్యతలు ఆయా మేనేజర్లతోపాటు ఆర్డీవోలకు అప్పగించి.. అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులు, విద్యార్థులకు ఈ బస్సులే ఆధారం. ఆయా ప్రాంగణాలకు వచ్చేవారికి మెరుగైన వసతులు సమకూరుస్తారు. వైఫై, డిజిటల్ బోర్డులు, మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయంతోపాటు పచ్చదనం, ఆహ్లాదకరంగా ఉండేలా రంగులు వేయనున్నారు. ఇప్పటికే జిల్లా ప్రజారవాణా శాఖ అధికారులతో కలెక్టర్ మహేష్‌కుమార్ సమావేశమై చర్చించారు. ఆర్టీసీ కార్గో సర్వీసులపైనా పోలీసు నిఘా ఉంచాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ