నేను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్.. రామగుండం ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్, 29 జూలై (హి.స.) రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోని బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయని తనకు మాత్రం ఎలాంటి పదవులు లేవని అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్

రాజ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోని బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయని తనకు మాత్రం ఎలాంటి పదవులు లేవని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో అందరికీ పదవులు రావడమే తనకు మైనస్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వివేక్, శ్రీధర్ బాబులకు మంత్రి పదవులు దక్కాయి. ఇక గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ తాను కూడా అర్హుడినే అని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా కాలంగా పెద్దపల్లి పార్లమెంట్లో పార్టీకి సేవచేయడంతో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మరోసారి మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande