కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ.
హైదరాబాద్, 29 జూలై (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఉదయం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఉదయాన్నే ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి.. మాజీ సీఎంతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా
కెసిఆర్


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,

మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఉదయం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఉదయాన్నే ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి.. మాజీ సీఎంతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై కేసీఆర్ తో ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. అలాగే త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ బై పోల్స్ పై కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ చర్చల అనంతరం.. లోకల్ బాడీ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందు పోవాలని మాజీ సీఎం కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande