సబ్ పోస్ట్ ఆఫీస్ను హెడ్ పోస్ట్ ఆఫీస్లో విలీనం చేయొద్దంటూ పెన్షన్ దారుల ధర్నా
తెలంగాణ, సూర్యాపేట. 29 జూలై (హి.స.) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్యాంక్ స్ట్రీట్ ఉప పోస్ట్ ఆఫీస్ ను హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలనుకునే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ స్థానిక పెన్షన్ దారులు ఆందోళన చేపట్టారు . పెన్షన్ దారుల ఇబ్బందులను దృష్టిలో
సబ్ పోస్ట్ ఆఫీస్


తెలంగాణ, సూర్యాపేట. 29 జూలై (హి.స.)

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్యాంక్ స్ట్రీట్ ఉప పోస్ట్ ఆఫీస్ ను హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయాలనుకునే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ స్థానిక పెన్షన్ దారులు ఆందోళన చేపట్టారు . పెన్షన్ దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బ్యాంక్ స్ట్రీట్ ఉప తపాల కార్యాలయం ముందు పెన్షన్ దారులు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ పోస్ట్ ఆఫీస్ కింద 3వేల మంది పెన్షన్ దారులతో పాటు 3వేల మంది ఖాతాదారులు ఉన్నారన్నారు.

దీన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో విలీనం చేయడంతో వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్లు తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇదే పోస్ట్ ఆఫీస్ ని గతంలో చర్చి కాంపౌండ్ ప్రాంతంలో నిర్వహించగా దూర భారం కావడంతో తాము అధికారులకు విన్నవించిన వెంటనే 25వ వార్డులో ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande