డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రోటో కాల్ రగడ..
తెలంగాణ, వికారాబాద్. 29 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనలో అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గంలో యాలాల మండలం దౌవులాపూర్ ల
డిప్యూటీ సీఎం


తెలంగాణ, వికారాబాద్. 29 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి

భట్టి విక్రమార్క పర్యటనలో అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గంలో యాలాల మండలం దౌవులాపూర్ లో భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి రూ.230 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన, 6 విద్యుత్ సబ్ స్టేషన్ ల కు శంకుస్థాపనలు చేశారు. అయితే విద్యుత్ అధికారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఫోటోలు కనిపించలేదు. దీంతో పట్నం అభిమానులు విద్యుత్ అధికారుల తీరుపై మండిపడ్డారు.

ఇదిలా ఉండగా మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇటీవల కాగ్నా నది బ్రిడ్జి పై పడ్డ రంధ్రం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేయగా బిజెపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులు నశించాలి. అంటూ.. ఆందోళన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande