హైదరాబాద్, 29 జూలై (హి.స.)
బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ ఆలయం కూల్చివేయడంపై గత కొద్ది రోజులుగా భక్తులు, స్థానికులు, హిందూ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాగుల పంచమి సందర్భంగా భక్తులు హిందూ సంఘాలు, స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి బోనాలు సమర్పించేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు..ఘటన స్థలంలో భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట ఏర్పడింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా తరలివచ్చిన భక్తులు గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిని పునర్ ప్రతిష్టించే వరకు ఆందోళనలు చేపడుతూనే ఉంటామని హెచ్చరించారు.హిందూ సంఘాలు, భక్తులు రోడ్డుపై బైఠాయించి హనుమాన్ చాలీసా భక్తి పాటలు పాడుతూ నిరసన తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..