తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 29 జూలై (హి.స.)
అన్ని ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల నిర్వాహకులు ఈ పాస్ యంత్రాలతో దుకాణాల్లో నిల్వలను సరిగా చూసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాలు, మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, గొల్లపల్లి, బొప్పాపూర్ రోడ్ లోని పలు ఆగ్రో ఏజెన్సీ ఫర్టిలైజర్అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు.
దుకాణాల్లోని రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో తేడాలు ఉండటంతో ఇకముందు స్టాకులో తేడా ఉండకుండా చూడాలని ఆదేశించారు. అలాగే పురుగు మందుల శాంపులన్సు పరీక్ష చేయాలని అధికారులకు సూచించారువర్షాల నేపథ్యంలో రైతులకు ఎరువులు, ఇతర సామగ్రి విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎరువులు, విత్తనాలు విక్రయాలు నిబంధనల ప్రకారం నాణ్యమైనవి విక్రయించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు