అమరావతి, 29 జూలై (హి.స.)కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె తాడెపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 11 సీట్లు వచ్చిన వైసీపీని చూస్తే కూటమి నేతలకు భయమెందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన YS జగన్ (YS Jagan)కు భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించకుండా కుట్రలకు తెర లేపుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి (Mithun Reddy)తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం విక్రయించే మద్యానికి ఎవరైనా కమీషన్లు ఇస్తారని అని ధ్వజమెత్తారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని.. ఎగిరెగిరి పడుతున్న వారికి.. తాము అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుతామని రోజా కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి