హైదరాబాద్, 30 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు కుంభకోణం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వరుణ్ను బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు. వరుణ్ వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..