హైదరాబాద్, 30 జూలై (హి.స.)
తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల దాడులకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తుండగా.. ఒక్క హైదరాబాద్లోనే ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కీం
కేసులో కూపీ లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కాం లో రూ.700 కోట్లు అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..