సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థుల గోసం కనిపించకపోవడం అమానవీయం : హరీశ్రావు :
హైదరాబాద్, 30 జూలై (హి.స.) ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రరావు ప్రశ్నించారు. పరిపాలన గాలికి
హరీష్ రావు


హైదరాబాద్, 30 జూలై (హి.స.)

ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రరావు ప్రశ్నించారు. పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయం అని హరీశ్రావు పేర్కొన్నారు.

తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్థ పాలన అని హరీశ్రావు మండిపడ్డారు. We want justice అన్నందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది అని ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande