జోగులాంబ జిల్లాలో సౌకర్యాల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు..
జోగులాంబ గద్వాల, 30 జూలై (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల విద్యార్థులు పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు బుధవారం ర్యాలీగా బయలుదేరారు. 10వ త
విద్యార్థులు


జోగులాంబ గద్వాల, 30 జూలై (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్

మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల విద్యార్థులు పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు బుధవారం ర్యాలీగా బయలుదేరారు. 10వ తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థులు ఉదయం 8 గంటలకు 44వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా బయల్దేరారు. 7 కిలోమీటర్లు నడిచి వెళ్లిన విద్యార్థులను పోలీసులు నిల్వరించినా వినకుండా ర్యాలీ కొనసాగించారు. అలంపూర్ పోలీసు ఉన్నతాధికారులు ఇటిక్యాల పాడు స్టేజికి చేరుకుని విద్యార్థుల సమస్యల పై ఆరా తీశారు. జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్లడం వల్ల అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని, అధికారులతో మాట్లాడి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని విద్యార్థులకు పోలీసులు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు ససేమీరా అంటూ గద్వాల కలెక్టరేట్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ప్రత్యేక వాహనాన్ని రప్పించి అందరినీ అందులో ఎక్కించి తిరిగి పాఠశాలకు చేర్చారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande