మంచిర్యాల జిల్లా కేంద్రం లోని.ఓ.జూనియర్ కళాశాల విద్యార్దిని భవనం పై నుంచి దూకి మృతి
మంచిర్యాల, 30 జూలై (హి.స.) , : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్‌ కళాశాల భవనంపై నుంచి మంగళవారం సాయంత్రం సహస్ర(18) అనే విద్యార్థిని అనుమానాస్పదంగా కిందపడి మృతి చెందింది. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన కొత్తపల్లి రమేష్, వనితలకు ఇద్దరు కుమార్తెలు.
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని.ఓ.జూనియర్ కళాశాల విద్యార్దిని  భవనం పై నుంచి దూకి మృతి


మంచిర్యాల, 30 జూలై (హి.స.)

, : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్‌ కళాశాల భవనంపై నుంచి మంగళవారం సాయంత్రం సహస్ర(18) అనే విద్యార్థిని అనుమానాస్పదంగా కిందపడి మృతి చెందింది. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన కొత్తపల్లి రమేష్, వనితలకు ఇద్దరు కుమార్తెలు. రమేష్‌ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పని చేస్తారు. పెద్ద కూతురు సహస్ర గతేడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం మంచిర్యాలలోని ఓ కళాశాలలో డేస్కాలర్‌గా చదివింది. తల్లిదండ్రులు ఆమెను రెండో సంవత్సరం వేరే కళాశాలలో హాస్టల్‌లో చేర్పించారు. ఇటీవల సహస్ర పెద్దనాన్న శ్రీనివాసులు అనారోగ్యంతో మృతిచెందగా ఇంటికి వెళ్లిన ఆమెను కుటుంబసభ్యులు మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు తిరిగి తీసుకొచ్చారు. సాయంత్రం మూడో అంతస్తుకు వెళ్లిన సహస్ర కిటికీ ద్వారం నుంచి కిందపడింది. ఈ ఘటన కళాశాలకు ఎదురుగా ఉన్న పలు దుకాణాదారులు చూస్తుండగానే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

కళాశాల సిబ్బంది ఆమెను స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనా స్థలాన్ని సీఐ ప్రమోద్‌రావు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. కళాశాలకు వచ్చినప్పటి నుంచి సహస్ర బాధపడుతూనే ఉందని, తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని తోటి విద్యార్థినుల వద్ద విలపించినట్లు తెలుస్తోంది. కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా తరగతులు నిర్వహిస్తున్నారని, భవన నిర్మాణ పనులు పూర్తికాలేదని, కిటికీ వద్ద గ్రిల్స్‌ లేకపోవడంతోనే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కళాశాల నిర్వహణ(జేఈఈ, నీట్‌)కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని ‘న్యూస్‌టుడే’కు డీఐఈవో అంజయ్య తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు రాలేదని అందగానే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి కళాశాల ఎదుట కూర్చొని నిరసన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande