వనపర్తి, 30 జూలై (హి.స.) వనపర్తి
నియోజకవర్గం ఏదుల మండలం చీర్కపల్లి గాంధీ నగర్ కాలనీలో దేవరీ రేణుక నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సొంతింటి కల సహకారం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తి నియోజకవర్గ మొత్తంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అవుతున్నాయని మరో 2000 ఇండ్లను అదనంగా మంజూరు చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో పూరిగుడిసె, రేకుల ఇల్లు, పాత మట్టి మిద్దెలు లాంటివి లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఇంటి ఇబ్బందులు తొలగించి సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్