సింగపూర్, 30 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాల్గొవ రోజైన బుధవారం వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు.
- ఈ రోజు ఉదయం క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) సీఈవో సంజీవ్ దాస్‌గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ పార్క్‌లలో పెట్టుబడులపై చర్చిస్తారు.
- మండాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ సీఈవో మైక్ బార్క్‌లేతో భేటీ కానున్నారు. ఎకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్‌లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్‌పై చర్చిస్తారు.
- ఎస్ఎంబీసీ బ్యాంక్-ఇండియా డివిజన్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్‌పై చర్చిస్తారు.
- టెమసెక్ కంపెనీ జాయింట్ హెడ్–పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్ దినేశ్ ఖన్నాతో భేటీ కానున్నారు. పబ్లిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్-హెల్త్ ఫండింగ్‌పై సహకారాన్ని కోరనున్నారు.
- సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. భారత్–సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలు చర్చకు రానున్నాయి.
- ఉదయం 11 గంటలకు నేషనల్ సెక్యూరిటీ అండ్ హోం అఫైర్స్ మంత్రి కే. షణ్ముగంతో విందు సమావేశం జరగనుంది. సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలు చర్చకు వస్తాయి.
- మధ్యాహ్నం 1:30 గంటలకు సెంబ్‌క్రాప్ సీఓఓ చార్లెస్ కోతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రెన్యువబుల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు చార్లెస్ కో ముందుంచుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి