మాలేగావ్‌ పేలుడు కేసు.. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ సహా ఏడుగురూ నిర్దోషులే
ముంబయి: 31 జూలై (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ పేలుడు కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మ
Delhi school bomb hoax


ముంబయి: 31 జూలై (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ పేలుడు కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురు నిందితులను ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈమేరకు గురువారం తీర్పు వెలువరించింది.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న చోటుచేసుకున్న పేలుడు తీవ్రతకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్‌.. ప్రస్తుత సాక్షి (40వ నంబరు) సహా పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదుచేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏ స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.

2

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande