అమరావతి, 31 జూలై (హి.స.) : ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శుక్రవారం కడపకు చేరుకుని జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. గ్రామస్థులతో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి గండికోటకు చేరుకుంటారు. కేంద్రప్రభుత్వ సహకారంతో సాస్కీ పథకం కింద రూ.78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేశ్ నిడదవోలులో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి