నెల్లూరు, 31 జూలై (హి.స.)
, :జిల్లాలో హైటెన్షన్ వాతవరణం నెలకొంది. ఇవాళ(గురువారం) నగరంలో మాజీ సీఎం జగన్ పర్యటన వేళ భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు అంక్షాలు విధించగా.. వాటిని పట్టించుకోకుండా వైసీపీ నాయకులు జనసమీకరణ చేయడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యనేతలతో పాటు కొందరు నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా నెల్లూరులో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు.. నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ