సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, 31 జూలై (హి.స.) ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో కోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు బిఅర్ఎస్ నాయకుల తీరు ఉంద
ఆది శ్రీనివాస్


హైదరాబాద్, 31 జూలై (హి.స.) ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో

కోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు బిఅర్ఎస్ నాయకుల తీరు ఉందని పార్టీ మారిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని, ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం చేశారని, శాసనసభ్యుల సభ్యత్వ రద్దు అధికారం కేవలం స్పీకర్ కే ఉంటుందని గుర్తు చేశారు. అలాగే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని దుష్ప్రచారం చేసిందని, సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande