హైదరాబాద్, 31 జూలై (హి.స.)
హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన
కార్యాలయం అయిన గాంధీ భవన్ వద్ద నేడు ఉద్దేక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున నగరానికి వచ్చిన ఎస్టీ పోరాట సమితి నేతలు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి వర్గంలో ఎస్టీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గాంధీ భవన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎస్టీ పోరాట సమితి నేతలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్