హైదరాబాద్, 31 జూలై (హి.స.) దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో భారత సూచీలు నష్టాల బాట పట్టాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్కు రెండు రోజుల లాభాలు ఒక్కసారిగా ఆవిరవుతున్నాయి. నేటి ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 80,946 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు క్షీణించి 24,696 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.66 దగ్గర కొనసాగుతుంది.
అయితే, నిఫ్టీ సూచీలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జేఎస్ఈబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, హెచ్ఐయూఎల్ షేర్లు రాణిస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..