తెలంగాణ, జనగామ. 31 జూలై (హి.స.)
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణాలను గురువారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా భాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వారు సంబంధిత షాపుల యందు యూరియా స్టాక్ వివరాలు, సరిపోను యూరియా ఉందా అని అడిగి తెలుసుకొని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పురుగు మందుల
ఎరువులు దుకాణాల దారులు రైతులకు కాలం చెల్లిన మందులు విక్రయిస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు అందించాలని సూచించారు. మందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని కల్తీ విత్తనాలు మరియు పురుగు మందులు విక్రయించినట్లయితే అట్టి షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు