హైదరాబాద్, 31 జూలై (హి.స.) కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించింది. ఈ మేరకు బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా రాగా ఆయనకు రెండు సీల్డ్ కవర్లలో కమిషన్ తన నివేదికను అందజేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. కమిషన్ నుంచి నివేదిక తీసుకున్నామని ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన అందజేస్తామని కార్యదర్శి కె.రామకృష్ణారావుకు తెలిపారు. అనంతరం నివేదికతో ఆయన నేరుగా సచివాలయానికి బయలుదేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్