భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కామారెడ్డి సబ్ కలెక్టర్
కామారెడ్డి, 31 జూలై (హి.స.) భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. బిచ్కుందలోని తహసిల్దార్ కా
కామారెడ్డి సబ్ కలెక్టర్


కామారెడ్డి, 31 జూలై (హి.స.)

భూభారతి రెవెన్యూ సదస్సులో

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. బిచ్కుందలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుదారునికి నోటీసు జారీ చేసిన తర్వాత విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారునికి సంబంధించిన పాత పహాని, కాసర పహానీతోపాటు లింక్ డాక్యుమెంట్ జిరాక్స్లను తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతి నిబంధనలపై అధికారులు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావులేకుండా సమస్యలు పరిష్కారమవు తాయని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande