25మంది ఎమ్మెల్యేలను కొన్న కేటీఆర్ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు: కోమటిరెడ్డి
హైదరాబాద్, 31 జూలై (హి.స.) పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వస్తే వందశాతం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గతంలో 25 మంది ఎమ్మెల్యేలను కొనుగ
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 31 జూలై (హి.స.)

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక

అర్హత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వస్తే వందశాతం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గతంలో 25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, కేటీఆర్ ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇతర పార్టీల నుండి గెలిచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండా బీఆర్ఎస్లో చేరితే మంత్రి పదవులు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, కోర్టు తీర్పు ఆధారంగానే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కానీ తాము ఆ విధంగా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరలేదని, వాళ్లంతా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారన్నారు. ఇది కోర్టు సంబంధిత అంశం కాబట్టి ఎక్కువగా మాట్లానని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పనిచేయలేదని, తాము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కవితనే తమ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని అంటే అర్థం చేసుకోవచ్చన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande