తెలంగాణ, ఖమ్మం. 31 జూలై (హి.స.)
కూసుమంచి మండల కేంద్రంలో
పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలంలో నూతనంగా 5.5కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్ లకు డిసెంబర్ 31 వరకు నూతన కళాశాల భవనం పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నూతన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరo 8,9,10వ తరగతుల వారికి ఈ సంవత్సరం 7వ తరగతి చేరిన వారికి ఇంటర్ చదివే విద్యార్థినిలకు సైకిళ్లు అందజేశామని, అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న అందరు విద్యార్థినులకు సైకిళ్ళు అందజేస్తామని తెలిపారు. గత 18 నెలల్లో పాలేరు నియోజకవర్గంలో విద్యకు 470 కోట్లు ఖర్చు చేశామన్నారు. నియోజకవర్గంలో ఒక ఇంటి గ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో సాధించుకున్నామని, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల 207 కోట్లతో, ఐటిఐ కళాశాల 45 కోట్లతో మంజూరు చేపించుకున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు