తమిళనాడులో మళ్లీ ప్రధాని పర్యటన
చెన్నై: 31 జూలై (హి.స.) ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 26 ప్రధాని మోదీ తూత్తుకుడిలో పునర్నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించి, మరుసటి రోజు గంగైకొండచోళపురం రాజేంద్రచోళుడి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న విషయం విదితమే.
Source -x @narendramodi


చెన్నై: 31 జూలై (హి.స.) ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 26 ప్రధాని మోదీ తూత్తుకుడిలో పునర్నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించి, మరుసటి రోజు గంగైకొండచోళపురం రాజేంద్రచోళుడి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఆగస్టు 26 నుంచి 27 వరకు ఆయన తిరువణ్ణామలై, కడలూరు(Tiruvannamalai, Cuddalore) జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఆ సందర్భంగా తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శించి, ఆ తర్వాత కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ ఆలయం నుంచే మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలోనూ పాల్గొననున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande