వరంగల్లో ప్రారంభమైన తెలంగాణ డ్యూటీ మీట్ 2025
హైదరాబాద్, 31 జూలై (హి.స.) వరంగల్ మామునూరులో గురువారం తెలంగాణ పొలీస్ డ్యూటీ మీట్-2025 ప్రారంభమైంది. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ హాజరై డ్యూటీ మీట్ను ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగనున్న ఈ పోటీల్లో ఉ
పోలీస్ డ్యూటీ మీట్


హైదరాబాద్, 31 జూలై (హి.స.)

వరంగల్ మామునూరులో

గురువారం తెలంగాణ పొలీస్ డ్యూటీ మీట్-2025 ప్రారంభమైంది. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ హాజరై డ్యూటీ మీట్ను ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగనున్న ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల్లోని వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొననున్నారు.

మొత్తం ఏడు పోలీస్ జోన్లతోపాటు సైబరాబాద్, రాచకొండ,హైదరాబాద్ కమిషనరేట్ల పోలీసులతో పాటు సిఐడి,ఇంటిలిజెన్స్, యాంటీనార్కటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్ విభాగాలకు చెందిన సుమారు 1000 మంది అధికారులు, సిబ్బంది ఈ పోటీలో పాల్గొన్నారు. సైంటిఫిక్ ఏయిడ్ టూ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ సంబంధించిన 25 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఆగస్టు రెండున ముగింపు కార్యక్రమాలు, అదే రోజు బహుమతుల ప్రధానోత్సవం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande