హైదరాబాద్, 31 జూలై (హి.స.)
ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కోర్టు శాసనసభ స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పిటీషనర్ వివేకానంద సుప్రీమ్ కోర్టు తీర్పుపై స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నామని కామెంట్ చేశారు. ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కోర్టు చెప్పిన విధంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి గౌరవించాలని వివేకానంద అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..