తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 31 జూలై (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ మహిళల సమాఖ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన పెట్రోల్ బంక్ ను గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక మహత్తరమైన అడుగుగా పేర్కొన్నారు. ఇది కేవలం మహిళలకే కాక, గ్రామ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే మోడల్గా నిలుస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ సందీప్ ఝా మాట్లాడుతూ మహిళా సంఘాల సామర్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామ స్థాయిలో ఇలాంటి పథకాల ద్వారా మహిళలకి ఆర్థిక బలం కలిగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు