కేసీఆర్ తో ఫామ్ హౌస్లో ఆ ముగ్గురు భేటీ.. ఆ మూడు అంశాలపైనే కీలక చర్చ!
హైదరాబాద్, 31 జూలై (హి.స.) గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ తో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్ , జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా వారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగ
కెసిఆర్


హైదరాబాద్, 31 జూలై (హి.స.)

గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్

తో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్ , జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా వారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. నేటితో పి. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వర కమిషన్ గడువు ముగిసి.. ప్రభుత్వానికి రిపోర్టు అందిన నేపథ్యంలో దానిపై డిస్కస్ చేయబోతున్నట్లుగా సమాచారం.

కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. తదుపరి ప్రభుత్వంపై ఎలా కౌంటర్ అటాక్ ఎలా చేయాలి అనే దానిపై సమాలోచనలు చేయనున్నారు. ఇక పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై కూడా చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీ సన్నద్ధత, అభ్యర్థి ఎంపికపై హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కేటీఆర్ తమ అభిప్రాయాలను కేసీఆర్తో పంచుకోనున్నట్లుగా తెలుస్తోంది. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించే చాన్స్ ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande