అమరావతి, 31 జూలై (హి.స.)
నెల్లూరు: వైకాపా అధ్యక్షుడు జగన్ నెల్లూరు పర్యటనలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి భారీగా ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మాలకొండయ్యకు గాయాలయ్యాయి. ఓ సీఐ కిందపడిపోయారు. కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ