సరోగసి పేరుతో సృష్టి ఇప్పటివరకు చాలా మోసాలు చేసింది
రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీ
Surrogacy


హైదరాబాద్, 31 జూలై (హి.స.)సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. రాజస్థాన్ దంపతులే డీఎన్ఏ చేయించుకోవడంతో అసలు నిజయం బయటపడింది. డీఎన్ఏతో మా మోసం వెలుగులోకి వచ్చిందన్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పామని.. రాజస్థాన్ దంపతులనుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్లు కాంటాక్ట్ ని పూర్తిగా బ్లాక్ చేశామని వివరించారు. రాజస్థాన్ దంపతుల నుంచి ఒత్తిడి రావడంతో అడ్వకేట్ అయిన తన కుమారున్ని రంగంలో దించినట్లు.. తన కుమారుడి ద్వారా దంపతులను బెదిరించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande