తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం..
హైదరాబాద్, 31 జూలై (హి.స) తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జస్టిస్ గాడి ప్రవీణ్ కు
హైకోర్టు


హైదరాబాద్, 31 జూలై (హి.స)

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణా రెడ్డి, జస్టిస్ చలపతి రావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ఉన్నారు. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. దేశంలోని పలు హైకోర్టులకు ఇటీవలే 19 మంది జడ్జిలు, అడిషనల్ జడ్జిలు నియమితులయ్యారు. పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను జడ్జిలు/అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande